కమల్ హాసన్ విక్రమ్ టీజర్.. అదిరిపోయిందంతే..

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా రూపొందుతుందన్న ప్రకటన వచ్చి చాలా రోజులయ్యింది. నేడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసారు. విక్రమ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. ఊరికి దూరంగా ఒకానొక బంగ్లాలో ఒక్కడే ఉంటున్న కమల్ హాసన్, కొంతమందికి విందుభోజనం ఏర్పాటు చేసాడు. అతిధులు వచ్చే ముందర కమల్ హాసన్, గదిలో ఉన్న తుపాకులన్నింటినీ అక్కడక్కడా దాచేస్తూ కనిపించాడు.

అతిధులుగా వచ్చిన వాళ్లంతా ముసుగులేసుకుని, కమల్ పాత్ర ఒక్కటే ముసుగు లేకుండా కనిపించింది. చూస్తుంటే లోకేష్ కనగరాజ్ మరో మారు థ్రిల్లర్ జోనర్ లో సినిమా తీస్తున్నాడని అర్థం అవుతుంది. అనిరుధ్ ఇచ్చిన నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది. కమల్ హాసన్ 232వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలవుతుందట