విశ్వరూపం-2 ట్రైలర్ ఇది కమల్ నిజ విశ్వరూపమే..!

-

కమల్ హాసన్ నటిస్తూ దర్శక నిర్మాతగా వ్యవహరించిన సినిమా విశ్వరూపం మంచి సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సీక్వల్ గా అందులో సంధించిన ప్రశ్నలన్నిటికి సమాధానంగా ఈ సినిమా వస్తుంది. సినిమాలో కమల్ హాసన్ మరోసారి తన నట విశ్వరూపం చూపించారని తెలుస్తుంది. ట్రైలర్ ఓ హాలీవుడ్ సినిమా భావన కలిగిస్తుంది.

దర్శక నిర్మాతగా కమల్ ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కనిపించలేదు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 10న రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. కమల్ మరోసారి తన విశ్వరూపం చూపించిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలే ఏర్పరచుకున్నారు.

ఆ అంచనాలను మరింత పెంచేలా ఈ సినిమా ట్రైలర్ ఉంది. ఆండ్రియా, పూజా కుమార్ లకు ఈ పార్ట్ లో ప్రాధాన్యత ఉందని తెలుస్తుంది. మరి కమల్ విశ్వరూపం పార్ట్ 1 కన్నా పెద్ద హిట్ అవుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news