కంగనా రనౌత్: ఈ దేశంలో ముస్లిం హీరోలకు హీరోయిన్స్ కు ఆదరణ వుంది కాని.!

-

షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ బాక్సాఫీస్ వద్ద సునామీగా మారిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పఠాన్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన షారుక్ ఖాన్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఎన్నాళ్ళ నుండో బాలీవుడ్ వారు వెయిట్ చేస్తున్న విజయం లభించింది అని సంబరాలు చేసుకుంటున్నారు.

దీపికా పడుకునె, జాన్ అబ్రహం ఇతర ప్రధాన తారాగణంతో తెరకెక్కిన పఠాన్ సినిమా అన్ని చోట్లా  అన్ని రకాల భాషల్లో మల్టీప్లెక్స్‌, సింగిల్ స్క్రీన్ తేడా లేకుండా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ పఠాన్ చిత్రం తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు.  ఇప్పటి వరకు 429 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం లాంగ్ రన్ లో ఊహించని రీతిలో వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక ఈ చిత్రం పై కంగనా రనౌత్ తన దైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఈ సినిమా పై ఒక నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ మన దేశంలో అన్ని రకాల సినిమాలు హిట్ అవుతాయి అంటూ కామెంట్స్ చేయగా నెటిజన్ కామెంట్స్ కి కంగనా తనదైన శైలిలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘చాలా మంచి విశ్లేషణ. ఈ దేశం చాలా సందర్భాలలో కేవలం ఖాన్‌లను మాత్రమే ప్రేమిస్తుంది. ముస్లిం హీరోయిన్లంటే మక్కువ చూపిస్తుంది. కాబట్టి, ఈ దేశంలో ద్వేషం, పాసిజం ఉందని నిందలు వేయడం చాలా అన్యాయం. ప్రపంచంలో భారత్‌ లాంటి దేశం ఇంకోటి లేదు’’ అంటూ కంగనా వాఖ్యలు చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version