జయలలిత బయోపిక్ ‘తలైవి’ కోసం కంగనా.. భారీ డిమాండ్..!

-

సిని తార, తమిళనాడు మాజి ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో తలైవి సినిమా తెరకెక్కుతుంది. ఏ.ఎల్.విజయ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు కథను విజయేంద్ర ప్రసాద్ అందించారు. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తుంది. రీసెంట్ గా మణికర్ణికతో సత్తా చాటిన కంగనా రనౌత్ సౌత్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది.

అప్పుడెప్పుడో పూరి డైరక్షన్ లో ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ తో జతకట్టిన కంగనా మళ్లీ సౌత్ సినిమా లో చేస్తున్న సినిమా తలైవి. ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. తమిళం, తెలుగు భాషల్లో తలైవిగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా హిందిలో మాత్రం జయ అని టైటిల్ ఫిక్స్ చేశారు.

ఇక ఈ సినిమాలో నటించేందుకు గాను కంగనా పాతిక కోట్ల రెమ్యునరేషన్ అడిగిందని తెలుస్తుంది. ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరోయిన్ తీసుకోని మొత్తాన్ని తలైవి కోసం కంగనా తీసుకుంటుంది. ఆమె డిమాండ్ చేసిన పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. కంగనా రెమ్యునరేషనే ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version