కంగనా తో రిలేషన్ పెట్టుకున్న అతనెవరు..?

-

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తను చేసే సినిమాలు వాటి ఫలితాలతో పాటుగా ఆమె చేసే కామెంట్స్ కూడా బాలీవుడ్ లో సంచలనాలు సృష్టిస్తాయి. రీసెంట్ గా మణికర్ణిక సినిమా రిలీజ్ టైంలో కంగనా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బాలీవుడ్ మొత్తాన్ని తప్పుబట్టేలా ఆమె చేసిన కామెంట్స్ అందరిని షాక్ అయ్యేలా చేశాయి.

ఇక ఈమధ్య ఇండియా టుడే మీడియా సంస్థ ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ తాను ఒకరితో రిలేషన్ తో ఉన్న విషయాన్ని కన్ఫాం చేసింది కంగనా రనౌత్. బాలీవుడ్ స్టార్ హీరోస్ తో కంగనా లవ్ మ్యాటర్స్ గురించి అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అయితే ఈమధ్య అలాంటివేవి లేవని అనుకుంటున్న టైంలో కంగనా తను లవ్ లో ఉన్నానని చెప్పడం సర్ ప్రైజ్ చేసింది.

అయితే అతనెవరు అన్నది మాత్రం చెప్పని కంగనా అతన్ని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటుందట. పెళ్లి చేసుకుని కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేయాలని చూస్తుందట కంగనా. కంగనా నుండి వచ్చిన ఈ ఎనౌన్స్ మెంట్ బాలీవుడ్ ను షాక్ అయ్యేలా చేసింది. మరి ఇంతకీ కంగనా మనసు గెలిచిన ఆ వ్యక్తి ఎవరన్నది పెద్ద చర్చ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version