కంగ‌న ఇంట్లో ఏం జ‌రుగుతోంది?

 

కంగ‌న ర‌నౌత్‌.. బాలీవుడ్‌లో ఓ ఫైర్ బ్రాండ్‌. ప్ర‌తీ విష‌యాన్నిసూటిగా ప్ర‌శ్నిస్తూ బాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌త నెల రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన కంగ‌న ప్ర‌స్తుతం పెళ్లి వేడుక‌ల్లో మునిగితేలుతోంది. త‌న సోద‌రి రంగోలీ చండేల్ వివాహం త‌రువాత కంగ‌న ఇంట శుభ‌కార్యం జ‌ర‌గ‌లేదంట‌. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కి త‌న త‌మ్ముళ్ల కార‌ణంగా ఇళ్లంతా క‌ళ‌క‌ల‌లాడుతోంద‌ని చెబుతోంది. కంగ‌న‌కు అక్షిత్‌, క‌ర‌ణ్ ఇద్ద‌రు సోద‌రులు.

వీరి వివాహ వేడుక‌ల్లో కంగ‌న చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. మూడు వారాల పాటు ఈ పెళ్లిళ్ల హంగామా జ‌ర‌గ‌నుంద‌ట‌. ఇందులో భాగంగా ముందు క‌ర‌ణ్ హ‌ల్దీ (న‌లుగు పెట్టే) కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ రోజు నుంచే పెళ్లి హంగామా మొద‌లైంది. ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ కంగ‌న సోష‌ల్ మీడియాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది.

రంగోలీ వివాహం త‌రువాత దాదాపు ద‌శాబ్దం త‌రువాత మా ఇంట్లో పెళ్లి సంద‌డి మొద‌లైంది. నా వివాహం కూడా జ‌ర‌గ‌లేదు. ఇన్నేళ్ల విరామం త‌రువాత ఇంట్లో నా సోద‌రులు క‌ర‌ణ్ అండ్ అక్ష‌త్‌ల ప్రీ వెడ్డింగ్ హంగామా మొద‌లైంది. ఈ పెళ్లి సంద‌డితో మా పూర్వికుల ఇల్లు సంద‌డితో మునిగిపోయింది` అని ట్వీట్ చేసింది.