Kangana Ranaut : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్… ఎప్పుడూ ఎవరినో ఒకరిని కామెంట్ చేయడం, తద్వారా వివాదంలో చిక్కుకోవడం జరుగుతూ ఉంది. తన నటనతో ప్రేక్షకులను భారీగా అలరించే ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కాంట్రవర్సీలకు గురి అవుతూ ఉంటుంది. ఇటీవలే ఆమె నటిస్తున్న చిత్రం చంద్రముఖి 2..రిలీజ్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఇది ఇలా ఉండగా, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వైరల్ అయ్యాయి. కంగనా రనౌత్ ముంబైలో ఓ వ్యక్తి చేయి పట్టుకొని కనిపించడంతో వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే పుకార్లు మొదలయ్యాయి. దీనిపై కంగానా స్పందించారు. ‘అమ్మాయి, అబ్బాయి వీధిలో నడుచుకుంటూ వెళ్తే అది సెక్సువల్ రిలేషనేనా? వాళ్లు కొలీగ్స్, వర్క్ ఫ్రెండ్స్, సిబ్లింగ్స్ కావచ్చుగా. క్లైంట్ తో హెయిర్ స్టైలిస్ట్ కూడా అయ్యుండొచ్చు’ అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. దీంతో అతడు హెయిర్ స్టైలిస్ట్ అని తేలిపోయింది.