పవన్ పక్కన కన్నడ స్టార్..?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ తో పాటు మరో మూడు సినిమాలని లైన్లో పెట్టిన పవన్ కళ్యాణ్, తాజాగా మరో సినిమాని ప్రకటించాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రూపొందే ఈ సినిమాకి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఐతే ఈ సినిమా మళయాలీ చిత్రమైన అయ్యప్పనుమ్ కోషియం చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతుందని టాక్.

అధికారికంగా ఈ విషయం ఇంకా ప్రకటించలేదు. అయ్యప్ప పాత్రలో పవన్ కళ్యాన్ కనిపిస్తే, కోషి పాత్రలో ఎవరు కనిపిస్తారనే చర్చ కొనసాగుతూనే ఉంది. తాజా సమాచారం ప్రకారం కోషి పాత్ర కోసం కన్నడ స్టార్ సుదీప్ ని తీసుకోనున్నారని వినబడుతుంది. ఈగ సినిమాలో విలన్ గా మెప్పించిన సుదీప్ తెలుగు వారందరికీ సుపరిచితమే. మరి పవన్ పక్కన సుదీప్ ని నిజంగానే తీసుకొస్తున్నారా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news