మంచు విష్ణు ‘కన్నప్ప’లో మరో స్టార్‌ హీరో

-

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘కన్నప్ప’. ఈ సినిమాలో ఇప్పటికే పలువురు స్టార్లు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్-నయనతార, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వంటి నేతలు కనిపించనున్నారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో స్టార్ ఈ చిత్రంలో భాగంగా కానున్నట్లు కన్నప్ప టీమ్ నెట్టింట పోస్టు పెట్టింది.

ఇప్పటికే ఇందులోని తారాగణాన్ని ప్రకటించి అంచనాలు పెంచేసిన చిత్రబృందం తాజాగా మరో విషయాన్ని పంచుకుంది. ఈ భారీ బడ్జెట్‌ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌కుమార్‌ భాగం కానున్నారని తెలుపుతూ పోస్ట్‌ పెట్టింది. దీంతో ఈ సినిమాపై కన్నడ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.

విష్ణు ప్రధానపాత్రలో నటిస్తోన్న ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్‌-నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ కూడా ఇందులో భాగమయ్యారు. తాజాగా కన్నడ అగ్ర కథానాయకుడు శివరాజ్‌కుమార్‌ ఈ సినిమాలో నటించనున్నట్లు కన్నప్ప టీమ్ తెలిపింది. ‘ఆయనే సర్వం..ఆయనే విశ్వం’ అంటూ హర హర మహాదేవ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించింది. అయితే, ఆయన ఏ పాత్రలో కనిపించనున్నారని మాత్రం ప్రకటించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version