ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ `సైరా నరసింహారెడ్డి`బాహుబలి రికార్డుల టార్గెట్ గా బరిలోకి దిగుతోంది. చరిత్ర నేపథ్యం గల కథ కావడం…అందులో మెగాస్టార్ నటించడంతో ఈ రేంజ్ లో అంచనాలు ఏర్పడుతున్నాయి. టీజర్ కాస్త నిరుత్సాహ పరిచినప్పటికీ అంచనాలు ఏ మాత్రం తగ్గలేదు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా బిజినెస్ లెక్కలు ఒక్కోక్కటిగా లీకవుతున్నాయి. ఇప్పటికే ఆమెరికా ఓవర్సీస్ రైట్స్ భారీగా అమ్మడుపోయినట్లు సమాచారం. కానీ లెక్కలు మాత్రం బయటకు రాలేదు. తాజాగా కర్ణాటక రైట్స్ కళ్లు చెదిరే ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.
ఓ ప్రముఖ పంపిణీ సంస్థ 35 కోట్లకు థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. అదే నిజమైతే తెలుగు సినిమా చరిత్రలో రికార్డు నమోదైనట్లే. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమాకు ఇంత ధర పలికింది. లేదు. బాహుబలి రైట్స్ కూడా సైరా రైట్స్ తో పొల్చితే దరిదాపుల్లో కూడా కనిపించలేదు. టాలీవుడ్ హీరోలందరికంటే చిరుకు కర్ణాకటకలో మంచి మార్కెట్ ఉంది. గతంలో ఆయన నటించిన చాలా సినిమాలు మంచి ఫలితాలు సాధించాయి. చిరు పేరిట అక్కడ ప్రత్యేకంగా తెలుగు అభిమాన సంఘాలున్నాయి. దానికి తోడు సైరా చరిత్ర నేపథ్యం గల కథ కావడంతో ఈ రేంజ్ లో అమ్మడు పోయి ఉంటుందని ఎనలిస్టులు అభిప్రాయం.
కర్ణాటకలోనే ఆ రేంజ్ బిజినెస్ జరిగిందంటే? తెలుగు రాష్ర్టాల్లో సైరా బిజినెస్ అంచనా వేయడం అసాధ్యమనే అనిపిస్తోంది. ఇటీవలే సైరా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చిరు ఇప్పటికే డబ్బింగ్ పూర్తిచేసారు. గ్రాఫిక్స్ కు సంబంధించిన పనులు హాంకాంగ్ లో జరుగుతున్నట్లు సమాచారం. ఆ పనులు పూర్తికాగానే ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఇక సినిమాను ముందు అనుకున్నట్లు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.