హిందీలో 700 థియేటర్లలో కార్తికేయ 2 సినిమా !

-

హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం “కార్తికేయ 2”. ఈనెల 13న థియేటర్స్ లలో విడుదలై సక్సెస్ఫుల్ గా ప్రదర్శితమవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించింది.

ముఖ్యఅతిథిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, “ఈ సినిమాను హిందీలో సరదాగా రిలీజ్ చేద్దామని 50 థియేటర్స్ లలో విడుదల చేస్తే అది రెండో రోజుకు 200 థియేటర్స్ అయింది. ప్రస్తుతం 700 థియేటర్స్ లలో ఆడుతుంది. అంటే ఇవాళ భాష అని భారీకేడ్లను దాటుకొని ప్రజల గుండెల్లోకి వెళ్ళింది, అంటే సినిమాలో సత్తా లేకుంటే అలా జరగదు కదా. ఇలా అన్ని థియేటర్స్ లలో ఆడదు కదా. కాబట్టి ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాధించాలి” అని తెలిపారు.

మా సినిమాను ఎంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. చందు మొండేటి చాలా హార్డ్ వర్క్ చేశాడు. నిఖిల్, అనుపమ టెక్నికల్ టీం అందరూ బాగా సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది అని చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version