దేవ్ టీజర్.. కార్తి న్యూ స్టైల్..!

-

తమిళంతో పాటుగా తెలుగులో కూడా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న హీరో కార్తి. అన్న సూర్య కూడా టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కార్తి రజత్ రవిశంకర్ డైరక్షన్ లో చేస్తున్న సినిమా దేవ్. ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. కార్తి సరసన రకుల్ మరోసారి జతకట్టిన ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు.

కార్తి బైక్ రేసర్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో ఎవరో చెప్పినట్టు బ్రతకడం కన్నా తనకు నచ్చినట్టుగా జీవితాన్ని ఆస్వాదించడం అనే కాన్సెప్ట్ తో సినిమా వస్తుంది. కార్తి ఈ సినిమాలో కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. సినిమాలో స్టైలిష్ లుక్ లో కార్తి అదరగొట్టాడు. హారిస్ జైరాజ్ మ్యూజిక్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.

టీజర్ లో కథ ఇది అని చెప్పగా రేసర్ గా కార్తి కొత్త అటెంప్ట్ చేశాడని చెప్పొచ్చు. తమిళంతో పాటుగా తెలుగు వర్షన్ కూడా ఒకేసారి రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. మరి టీజర్ తో అలరించిన కార్తి దేవ్ తో ఎలాంటి సత్తా చాటుతాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news