హీరోగా కౌశల్.. నిలబడగలుగుతాడా..?

-

బుల్లితెర నటుడిగా.. సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ వేసుకుంటూ వచ్చే కౌశల్ బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎంతలా అంటే కౌశల్ ఆర్మీ అంటూ తనకోసమే ఓ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడేలా చేసుకున్నాడు. బిగ్ బాస్ 2లో 113 రోజుల ప్రయాణం అతని జీవితాన్ని మర్చేసిందని చెప్పొచ్చు.

బిగ్ బాస్ విన్నర్ అయ్యాక తన ఆర్మీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న కౌశల్ మీ కోసమే ఏం చేయమంటారని అడిగితే హీరో హీరో అని కేకలేయడం జరిగింది. తాను హీరోగా సినిమాలు చేసేందుకు సిద్ధమే ఇక దర్శకుల వేట మొదలు పెట్టాలని అన్నాడు కౌశల్. మాటవరసకి స్టార్ దర్శకులెవరైనా తనతో సినిమా చేస్తారేమో చూడాలని అన్నాడు.

స్టార్ దర్శకులు అవసరం లేదనుకోండి. ఇంతకీ కౌశల్ హీరోగా నిలబడతాడా.. బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ ఇలానే నిలుపుకోగలుగుతాడా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా బిగ్ బాస్ మాత్రం కౌశల్ కెరియర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా చేసిందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version