గీతా మాధురి కాదు గీతా ‘బాధురి’..!

-

బిగ్ బాస్ విన్నర్ గా టైటిల్ గెలిచిన కౌశల్ తన ఆర్మీని చూసి ఆశ్చర్యపోతున్నాడు. తాను ఒక్కడే హౌజ్ లో ఉంటే బయట తన కోసం ఇంతమంది ఉన్నారా అంటూ కౌశల్ ఎమోషనల్ అవుతున్నాడు. బిగ్ బాస్ విన్నర్ గా గెలిచిన తర్వాత కౌశల్ ఆర్మీ ఏర్పరచిన ఓ స్పెషల్ మీట్ లో మాట్లాడిన కౌశల్ ఇంటి సభ్యులను ఒక్కొక్కరిగా ప్రస్థావిస్తూ వారి గురించి మాట్లాడాడు.

ముఖ్యంగా తనీష్ ను తాను తనకు పొటీ అని ఎప్పుడు అనుకోలేదని అన్నాడు కౌశల్. అంతేకాదు బాబు గోగినేని తనని పంపించాలని శపథం చేస్తే నేను నామినేట్ చేయగా మీరు ఆయన్ను త్వరగానే ఎలిమినేట్ చేశారని అన్నాడు. ఇక ఇంట్లో తనని టార్గెట్ చేయనిది ఒక్క శ్యామలా మాత్రమే అని.. మిగతా ఇంటి సభ్యులంతా తనని సందర్భానుసరామగా టార్గెట్ చేశారని అన్నాడు కౌశల్.

ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన పూజా రామచంద్రన్ తనకు కౌశల్ ఆర్మీ గురించి చెప్పిందని.. అప్పటికి తాను చాలా ఎమోషనల్ అయ్యానని అన్నారు కౌశల్. కౌశల్ ఆర్మీ గురించి తెలిసిన దగ్గర నుండి గీతా మాధురి నన్ను ఊరకనే టార్గెట్ చేసిందని. ఆమె పాడేప్పుడే గీతా మాధురి.. మాములుగా ఆమె గీతా బాధురి అని కామెడీ చేశాడు కౌశల్. ఫైనల్ గా తన మీద కౌశల్ ఆర్మీ చూపిస్తున్న ఈ ప్రేమ ఇలానే కొనసాగాలని.. మీ ఆనందం కోసం హీరోగా కూడా ట్రై చేస్తా అని కూడా అన్నాడు కౌశల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version