బిగ్ బాస్-3 ఎన్.టి.ఆర్ హోస్ట్..!

-

బిగ్ బాస్ 2 యుద్ధం ముగిసింది. ఏమాటకామాట చెప్పాలంటే కంటెస్టంట్స్ గా మొదటి సీజన్ హౌజ్ మెట్స్ కలివిడిగా బిగ్ బాస్ ఆటతీరుని ప్రదర్శిస్తే.. ఈ సీజన్ లో అంతకుమించి అన్నట్టుగా గొడవలు.. నానా హంగామాలతో సీజన్ ముగించారు. ఎలాగోలా బిగ్ బాస్ 2 కూడా సూపర్ హిట్ అనిపించేసుకుంది. ఈ షోతో కౌశల్ కేవలం బిగ్ బాస్ విన్నర్ గానే కాదు కొంతమంది అభిమానులను తన ఆర్మీగా చేసుకున్నాడు.

బిగ్ బాస్ 1 అయ్యాక ఇయర్ దాకా టైం తీసుకున్న నిర్వాహకులు ఈసారి సీజన్ కు ఏమాత్రం లేటు చేయట్లేదని తెలుస్తుంది. బిగ్ బాస్ 3 కూడా అతి త్వరలోనే మొదలవనుందట. ఇప్పటికే కంటెస్టంట్స్ విషయంలో డిస్కషన్స్ మొదలు పెట్టారట. అయితే సీజన్ 2 హోస్ట్ గా చేసిన నాని ఇక బిగ్ బాస్ కు గుడ్ బై అని చెప్పేశాడు.

అందుకే మళ్లీ ఎన్.టి.ఆర్ ను హోస్ట్ గా దించుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. బిగ్ బాస్ 3కి హోస్ట్ గా తారక్ ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. అరవింద సమేత రిలీజ్ తర్వాత రాజమౌళి సినిమా చేస్తున్న ఎన్.టి.ఆర్ ఆ సినిమాతో పాటుగా బిగ్ బాస్ 3కి హోస్ట్ గా ఉండేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

Read more RELATED
Recommended to you

Exit mobile version