బిగ్ జోక్.. బిగ్ బాస్-3 హోస్ట్ కౌశల్..!

-

బిగ్ బాస్ సీజన్ 3 పై ఓ పెద్ద కామెడీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటి అంటే బిగ్ బాస్ 3 హోస్ట్ గా కౌశల్ ను సెలెక్ట్ చేయడమే.. ఏంటి బిగ్ బాస్ హోస్ట్ గా కౌశలా.. నిజమేనా అనుకోవచ్చు. బిగ్ బాస్ 2లో అత్యధిక ప్రజాదరణ లభించడం వల్ల కౌశల్ కు కాస్త క్రేజ్ పెరిగింది. సీజన్ 2 లో కౌశల్ ఆర్మీ చేసిన హంగామా తెలిసిందే. అయితే బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా ఎన్.టి.ఆర్, రానా, వెంకటేష్ ఇలా స్టార్స్ మధ్య చర్చలు కొనసాగుతుంటే కౌశల్ ఆర్మీ మాత్రం బిగ్ బాస్ సీజన్ 3కి హోస్ట్ కౌశల్ చేస్తే బాగుంటుందని అంటున్నారు.

వీళ్ల అభిమానం సంతకెళ్లా బిగ్ బాస్ వల్ల ఉన్న క్రేజ్ డబుల్ అయితే అయ్యింది కాని ఆ షోతో క్రేజ్ తెచ్చుకుని ఆ షోకి హోస్ట్ గా చేఅడం ఏంటి. అయినా కౌశల్ ఆర్మీ అనుకునేంత సీన్ కౌశల్ కు లేదని అందరికి తెలిసిందే. బిగ్ బాస్ హౌజ్ లోనే కాదు బయట కూడా గేం ఆడుతున్న కౌశల్ ఇప్పటివరకు సీజన్ 2 కంటెస్టంట్స్ రీ యూనియన్ లో ఒక్కసారి కలిసింది లేదు. మరి అలాంటి కౌశల్ ఎలా బిగ్ బాస్ 3కి హోస్ట్ అవుతాడు. ఆశకి ఓ హద్ధు ఉండాలి బాసు అంటూ కౌశల్ ఆర్మీకు కౌంటర్ ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version