హీరోగా కీరవాణి తనయుడు..!

-

సంగీత ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు కీరవాణి. మూడు దశాబ్ధాల కాలంగా తన సంగీతంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న కీరవాణి ప్రతి సినిమాకు తన మ్యూజిక్ తో సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్తున్నాడు. ఇక కీరవాణి ఫ్యామిలీ మొత్తం సినిమా రంగంలో పనిచేస్తున్నారు. ఆల్రెడీ కీరవాణి పెద్ద కొడుకు కాళభైరవ సింగర్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు.

ఇక ఇప్పుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహా హీరోగా మారాలని చూస్తున్నాడట. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన శ్రీ సింహా నటన మీద ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడట. అందుకే హీరోగా ప్రయత్నించాలని చూస్తున్నాడు. త్వరలోనే శ్రీ సింహా మొదటి ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ వస్తుందట. మ్యూజిక్ డైరక్టర్ తనయులు మ్యూజిక్ డైరక్టర్ అవడం కామన్ కాని కొత్తగా హీరో అవడం మాత్రం సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. శ్రీ సింహా ఎలాంటి సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news