నల భీమ పాకం చేస్తున్న జాన్వి..!

-

శ్రీదేవి తనయ జాన్వి కపూర్ సినిమాలతోనే కాదు తన ఫోటో షూట్స్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. దఢక్ సినిమతో బాలీవుడ్ ఆడియెన్స్ ను అలరిచిన ఈ అమ్మడు ప్రస్తుతం తక్త్ తో పాటుగా సైరత్ రీమేక్ లో నటిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే జాన్వి కపూర్ లేటెస్ట్ గా కిచన్ లో సందడి చేస్తుంది. పెద్దింటి పిల్లలు అసలు తమ ఇంట్లో కిచెన్ ఎక్కడ ఉందో తెలియదని అంటుంటారు కాని జాన్వి మాత్రం ఏకంగా కిచెన్ లో నల భీమ పాకం వండేస్తుంది.

కిచెన్ లో జాన్వి చేస్తున్న ప్రయోగాన్ని దఢక్ హీరో ఇషాన్ ఖట్టర్ తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జాన్వి కపూర్ కిచెన్ వీడియో వైరల్ గా మారింది. శ్రీదేవి తనయగా తన మీద ఉన్న బాధ్యత నిర్వతించేలా తన సినిమాల ఎంపిక చేసుకుంటుంది జాన్వి. సౌత్ సినిమాల మీద ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్న జాన్వి ఇక్కడ కూడా త్వరలో ఛాన్సులు కొట్టేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news