పెంగ్విన్ టీజర్ తో ఆకట్టుకున్న కీర్తి సురేష్ ..మరో అవార్డ్ పక్కా ..!

-

కీర్తి సురేష్ మహానటి సినిమా తర్వాత మరోసారి నటన కి ఆస్కారం ఉన్న పాత్రలో నటిస్తుంది. ఆ సినిమానే పెంగ్విన్. గత కొన్నాళ్ళుగా ఈ సినిమా గురించి అటు తమిళంలో ఇటు తెలుగులో సంచలనమైన నిర్ణయాలు ఆసక్తి కరమైన చర్చలు జరుగుతున్నాయి.లాక్ డౌన్ కారణంగా ఎట్టకేలకు ఈ సినిమాని ఓటీటీ ప్లాట్ ఫాం లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ విషయాన్ని ప్రకటించగానే తమిళ తెలుగు సినిమా ఇండస్ట్రీలలో ఆసక్తికరమైన చర్చ జరిగింది.

 

అయినా మేకర్స్ వెనకడుగు వేయకుండా అమోజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసేందుకు పూనుకున్నారు. ఇక కీర్తి సురేష్ పెంగ్విన్ లో చేసినటువంటి ఛాలెంజింగ్ పాత్ర పోషించడం ఇదే మొదటి సారి. తమిళ దర్శక నిర్మాత కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాని నిర్మించాడు. ఈశ్వర్ కార్తీక్ ఈ సినిమాని తెరకెక్కించాడు.

 

ఇక ఈ రోజు అన్నట్టుగానే ఈ సినిమా నుండి టీజర్ ని ట్విట్టర్ ద్వారా దర్శక నిర్మాతలు రిలీజ్ చేశారు. రిలీజైన కొంత సేపట్లోనే ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ నెల 11 న ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక కీర్తి సురేష్ కి తాప్సీ, మంజు వారియర్, సమంత, త్రిష కూడ తమ ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా టీజర్ ని రిలీజ్ చేయడం విశేషం. ఇక పెంగ్విన్ జూన్ 19 న నేరుగా అమోజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version