తెలంగాణ యాసపై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. నాది గుజరాత్ కాదంటూ !

-

నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ ‘దసరా’ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా, యాంకర్ సుమతో చేసిన ఇంటర్వ్యూలో కీర్తి తెలంగాణ యాస గురించి ఇంట్రెస్టింగ్ వాక్యాలు చేశారు. తెలంగాణ యాస మంచి స్పైసీగా ఉంటది కదా ఎలా నేర్చుకున్నావ్ అని సుమా అడగ్గా.. నాకు స్పైస్ టోలరెన్స్ చాలా ఇష్టం అని పేర్కొంది హీరోయిన్ కీర్తి సురేష్.

నేను గుజరాత్ నుంచి రాలేదు కదా.. చెన్నైయే కదా అని చెప్పడంతో సుమ షాక్ అయింది. కాగా దసరా సినిమా ఈనెల 30వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో విపరీతంగా పాల్గొంటుంది. దసరా సినిమా పూర్తిగా తెలంగాణ యాస లో ఉండనుంది. దీంతో ఈ సినిమా రిలీజ్ పై అందరూ ఆసక్తిగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news