మెగాస్టార్‌ పక్కన ‘మహానటి’..!

-

సైరా సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరక్షన్ లో ఓ సినిమా ప్లాన్ చేశాడు. ఈ సినిమాను కూడా రాం చరణ్ నిర్మిస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగా జూన్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస విజయలాతో దూసుకెళ్తున్న కొరటాల శివ చిరుతో ఎలాంటి సినిమా చేస్తాడో అని మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

కొరటాల శివ డైరక్షన్ లో చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ సెలెక్ట్ అయ్యిందని తెలుస్తుంది. మహానటి తర్వాతా కీర్తి క్రేజ్ డబుల్ అయ్యింది. ప్రస్తుతం తమిళంలో వరుస అవకాశాలు అందుకున్న కీర్తి సురేష్ మెగాస్టార్ సరసన లక్కీ ఛాన్స్ అందుకుంది. ఇప్పటికే సూపర్ స్టార్ రజినికాంత్, మురుగదాస్ డైరక్షన్ లో వస్తున్న దర్భార్ సినిమాలో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తుంది. తమిళంలో రజినితో.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఈ రెండు సినిమాలతో అమ్మడి రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news