సాధారణంగా థియేటర్లలో విడుదల అయిన సినిమాలు నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తాయి. అయితే కొన్ని చిత్రాలు నెలల తరబడినా ఓటీటీలోకి రావడం లేదు. అందులో అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ సినిమా ఒకటి. డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
మే 5న విడుదలైన ఈ కాంట్రవర్సీ సినిమా లాంగ్ రన్‌లో ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం బడ్జెట్ కేవలం రూ. 35 కోట్లే . కేరళలో వివాదాస్పదమైన లవ్ జిహాద్ నేపథ్యంలో తెరకెక్కిన ది కేరళ స్టోరీ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.
అయితే.. దేశంలో చర్చనీయాంశంగా నిలిచిన ‘ది కేరళ స్టోరీ’ మూవీ ఎట్టకేలకు OTT లోకి వచ్చేసింది. గతేడాది మే 5న విడుదలైన ఈ సినిమా ఇవాల్టి నుంచి జీ5 OTT లో హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్లు సాధించగా…. ఇందులో ప్రధానపాత్ర పోషించిన ఆదాశర్మ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. కేరళలో వేలమంది మహిళలు మిస్ అయినట్లు వచ్చిన ఆరోపణలతో ఈ సినిమాను తెరకెక్కించారు.