అసెంబ్లీ దెబ్బకే సీఎం రేవంత్ ఈ రోజు ప్రజాభవన్ కు వెళ్లారు – హరీష్‌ రావు

-

అసెంబ్లీ దెబ్బకే సీఎం రేవంత్ ఈ రోజు ప్రజాభవన్ కు వెళ్లారని మాజీ మంత్రి హరీష్‌ రావు ఫైర్‌ అయ్యారు. మాజీ మంత్రి హరీష్‌ రావు చిట్‌ చాట్‌ లో మాట్లాడుతూ… రోజూ ప్రజాభవన్ కు వెళ్తానని చెప్పిన సీఎం తొలి రోజు మాత్రమే వెళ్లారు….ఇదే అంశాన్ని మొన్న అసెంబ్లీలో మేము ఆధారాలతో సహా నిలదీశామన్నారు.
సీఎం ప్రజాభవన్ కు వస్తారని నిన్ననే సమాచారం ఇస్తే ఈ రోజు చాలా మంది తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్లేవారని తెలిపారు మాజీ మంత్రి హరీష్‌ రావు.

harish rao

కాగా,బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు రేవంత్ కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుతుండగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడొద్దు అంటూ కొత్త రూల్స్ పెట్టబోతున్నారట. ఇటీవల అసెంబ్లీలో కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు వాకౌట్ చేసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడడానికి ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు.ప్రతిపక్షం గొంతు నొక్కడం ఏమిటని ప్రజల్లో చర్చ జరగడంతో ఇకపై అసెంబ్లీ సమావేశాలు జరుతుండగా మీడియా పాయింట్ వద్ద ఎవరూ మాట్లాడొద్దు అంటూ స్పీకర్ కొత్త రూల్ పాస్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news