రిలీజ్ కు ముందే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న కేజీఎఫ్‌-2

ఈ సృష్టిలో త‌ల్లిని మించిన యోథుడు ఎవ్వ‌డూ లేడు.. ఈ డైలాగ్ ఎంత ఫేమ‌స్ ఓ మ‌నంద‌రికీ తెలిసిందే. ఇంత‌కీ నేను ఏ మూవీ గురించి చెప్తున్నానో మీక ఇప్ప‌టికే అర్థం అయి ఉంటుంది క‌దూ. అవునండి కేజీఎఫ్ సినిమా గురించే. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా.. ఇంకా కొంత మిగిలే ఉంటుంది. ఇందులోని ప్ర‌తి సీన్‌, డైలాగులు ఓ ట్రెండ్ అనే చెప్పాలి. ఈ సినిమాతో య‌శ్ నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు.


ఇప్పుడు దీనికి సీక్వెల్ గా కేజీఎఫ్‌-2 వ‌స్తోంది. ప్యాన్ ఇండియ‌న్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచానాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ప్ర‌శాంత్ నీల్ త‌న‌దైన శైలిలో తెర‌కెక్కిస్తున్నాడు. ఇక ఈ మూవీకి సంబంధించిన టీజ‌ర్ దీపావ‌ళి కానుక‌గా విడుద‌లూ ఎంత పెద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో చూశాం.

ఇప్పుడు దీని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది , ఈ సినిమా కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. ఇక దీని కోసం బుక్ మై షో లో 3 లక్షల మందికి పైగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నార‌ని ఆ సంస్థ తెలిపింది. దీంతో ఇండియా లోనే ఏ సినిమాకు రాని విధంగా రికార్డ్ సెట్ చేసింది ఈ సినిమా. అంటే ఈ సినిమా కోసం అభిమానులు ఎంత‌గా ఎదురు చూస్తున్నారో తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ గా న‌టిస్తున్నాడు. రావు రమేష్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ మూవీ.. రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు తిర‌గ రాస్తుందో చూడాలి.