కరోనా ఉద్ధృతిలోనే ముగిసిన విద్యా సంవత్సరం

-

విద్యా రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా ప్రభావంతో విద్యా సంస్థలు అన్ని మూతపడ్డాయి. ఈ ఏడాది జనవరి, ఫిభ్రవరి సమయంలో కరోనా ఉద్ధృతి తగ్గిందని భావించి విద్యా సంస్థలను పునఃప్రారంభించగా… మార్చి చివరలో కరోనా ఉప్పెనల ఎగిసి పడింది. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు విద్యా సంస్థలను మూసేసాయి. ఇక ఏడాదిగా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నా వాటి వల్ల పెద్దగా ఫలితం ఏమీ లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇక గతేడాది కరోనా నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు టెన్త్ ఇంటర్ విద్యార్థులను ఎలాంటి పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులను చేసారు. అయితే ఈ ఏడాదన్న పరీక్షలు నిర్వహించాలనుకుంటే కరోనా సెకండ్ వేవ్ దానికి అడ్డంకిగా మారింది. దీంతో ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి.

కాగా తెలంగాణలో ఈ ఏడాది విద్యా సంవత్సరం ఏప్రిల్ 26తో ముగియనుంది. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినంగా పరిగణిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

స్కూళ్ళు,జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై సీఎం కేసీఆర్, సీఎస్ , విద్యా శాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వేసవి సెలవులను ప్రకటించారు. 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను ఉత్తీర్ణులను చేసినట్లు మంత్రి గుర్తు చేశారు.స్కూళ్ళు, జూనియర్ కళాశాలలను ఎప్పుడు పునఃప్రారంభిస్తారనే విషయాన్ని రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను అనుసరించి జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news