ఎన్టీఆర్ సినిమాలో మ‌హేష్‌

351

మహర్షి సినిమాతో తన కెరీర్ లోనే భారీ విజయం అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా తర్వాత వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ త‌న నెక్ట్స్ సినిమాను కూడా త్వ‌రగా ప‌ట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

మ‌హేష్ నెక్ట్స్ సినిమా కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌తో ఉంటుంద‌ని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ తో ఎలాగైనా సినిమా చేయాలని భావిస్తున్నాడట మహేష్. నిన్న హైద్రాబాద్ వచ్చిన ప్రశాంత్…. మహేష్ కి కథ చెప్పాడట. ఇక్క‌డే ఓ ట్విస్ట్ కూడా ఉంది. ప్ర‌శాంత్ నీల్ ముందుగా ఎన్టీఆర్‌తో సినిమా చేయాల‌ని అనుకున్నాడు.

ఎన్టీఆర్ – మైత్రీ మూవీ మేక‌ర్స్‌లో ప్ర‌శాంత్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు అటు తిరిగి… ఇటు తిరిగి ప్ర‌శాంత్ వ‌చ్చి మ‌హేష్ కాంపౌండ్‌లో వాలాడు. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వ‌చ్చే జూన్ వ‌ర‌క ఎన్టీఆర్‌కు ఈ సినిమాతోనే స‌రిపోతుంది. ఆ వెంట‌నే కొర‌టాల‌కు క‌మిట్ అయిన‌ట్టు తెలుస్తోంది. అంటే ఎన్టీఆర్ 2021లో గాని ప్ర‌శాంత్‌కు దొర‌క‌క‌పోవ‌చ్చు.

అందుకే ఎన్టీఆర్‌తో చేయాల‌నుకున్న క‌థ‌తోనే ఇప్పుడు మ‌హేష్‌తో సినిమా చేసేందుకు ప్ర‌శాంత్ రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే అంశం పైన క్లారిటీ లేదు. మ‌హేష్ మాత్రం ప్ర‌శాంత్‌తో సినిమాకు గ‌ట్టిగా డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది.