ఖాన్స్ అందరూ కలసి పోయి మరీ హిట్స్ కొట్టాలని ప్లాన్.!

-

ఒక పక్క బాలీవుడ్ సినిమాలు అన్నీ ప్లాప్ అవడం, సౌత్ ఇండియన్ సినిమా బహుబలి పాన్ ఇండియా స్థాయి విజయం సాధించడం , దానికి తోడు  కేజీఫ్ లాంటి సూపర్ హిట్స్ రావటం వల్ల బాలీవుడ్లో అందరూ దక్షిణాది సినీ పరిశ్రమ ను అసూయగా చూడడం మొదలుపెట్టారు.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ నాశనం కావడానికి సౌత్ లు కారణమంటూ ఇటీవల డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇందుకు ఆయన ఇలాంటి మాజిక్ లు ఒక్కసారే కనెక్ట్ అవుతాయి. మళ్లీ మళ్లీ తీస్తే మాత్రం ప్లాప్ అవుతాయి అని ఇదందా గాలి మహిమ అన్నట్లుగా మాట్లాడారు.దీనితో ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన షారుక్ ఖాన్, సాల్మన్ ఖాన్, అమీర్ ఖాన్ లు కూడా ఆలోచనలో పడ్డారు. ఇలా ఉంటే తాము గట్టెక్క లేమని భావించి కొత్త ప్లాన్స్ కు తెరతీశారు.

తాజాగా షారుక్ ఖాన్,సాల్మన్ ఖాన్ కలసి నటించిన పఠాన్ 600 కోట్లు వసూళ్లు సాధించి 1000 కోట్లు వసూళ్లు కు పరిగెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో సల్మాన్ ఖాన్ కనపడటం కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఇలా ఖాన్ లు కలిసి పోయి వసూళ్ళు సాధించాలని ప్లాన్స్ వేశారు. ఇందులో భాగంగా మరో న్యూస్ హల్చల్ చేస్తోంది. ఇప్పడు అమీర్ ఖాన్ నిర్మాత గా సల్మాన్ ఖాన్ తో సినిమా చేయాలనే ఆలోచన తో ఉన్నాడట. ఇప్పటికే మంచి కథ కూడా వినిపించి డేట్స్ లాక్ చేశారని ప్రచారం జరుగుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news