జానీ మాస్టర్ కి కిచ్చా సుదీప్ కారు గిఫ్ట్… దీని విలువెంతో తెలుసా..?

-

డీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సక్సెస్ ఫుల్ కొరియోగ్రాఫర్గా కెరీర్లో దూసుకుపోతున్నాడు.చిరంజీవి తో సహా ఎంతో మంది స్టార్ హీరోలకు డాన్స్ మాస్టర్ గా పని చేసిన జానీ మాస్టర్ ఇప్పుడు తమిళ్ లో కూడా బిజీ అయిపోయారు. రీసెంట్ గా బీస్ట్ సినిమా నుంచి వచ్చిన అరబిక్ కుతూ పాట ఎంత రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో చూసాం.

 

ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. విజయ్ తో పాటుతమిళ్ లో చాలామంది స్టార్ హీరోలకు కూడా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా జానీ మాస్టర్ కు కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ఒక కార్ ని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని జానీ మాస్టర్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు . అయితే ఈ కారు పేరు మహీంద్రా తార్ దీని విలువ సుమారు రూ: 13.17 లక్షలు గా ఉంటుందని అంచనా. అయితే జానీ మాస్టర్ తన లైఫ్ లో సుదీప్ లాంటి మంచి మిత్రులను కలిగి ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉందంటూ పోస్ట్ లో పెర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version