మూడోసారి అదే దారిలో కీర్తిసురేశ్‌.. వెయిట్ చేసినా లాభంలేదుగా!

కీర్తి సురేశ్ అంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ క్రేజ్ లోనే అంతా ఆమెను గుర్తిస్తారు. ఆమె ఒక టైప్ న‌ట‌న‌కే ప‌రిమితం కాకుండా అన్ని రకాల సినిమాల్లో న‌టిస్తూ మెప్పిస్తోంది. స్టార్ హీరోల‌తో చేస్తూనే మ‌రోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీల్లో కూడా న‌టిస్తోంది. ఇప్ప‌టికే మ‌హాన‌టితో దేశ‌వ్యాప్తంగా ఫేమ‌స్ అయింది. ఇప్పుడు కూడా మ‌రో భారీ లేడీ ఓరియెంటెడ్ మూవీ కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకుంటోంది కీర్తి.

ఆమె ఇప్ప‌టికే న‌టించిన పెంగ్విన్‌, మిస్ ఇండియా మూవీలు ఓటీటీలో విడుద‌ల‌యి మిశ్ర‌మ స్పంద‌న అందుకున్నాయి. ఇక వీటి త‌ర్వాత ఆమె న‌టించిన మరో మూవీ గుడ్ లక్ సఖి. ఈ సినిమా గ‌తేడాది విడుదల కావాల్సి ఉండ‌గా.. క‌రోనా కార‌ణంగా వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది.

అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల కార‌ణంగా గుడ్ లక్ సఖి సినిమా ను కూడా జీ5 ఓటీటీ లోనే విడుదల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. చిత్ర యూనిట్ తో ఓటీటీ వారు మంత‌నాలు జ‌రుపుతూ భారీ ఆఫ‌ర్లు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. కాక‌పోతే ఇన్ని రోజులు థియేటర్ లో రిలీజ్ చేయాల‌ని భావించిన టీమ్‌.. ఇప్పుడు త‌ప్ప‌నిస‌రి ఓటీటీ బాట‌నే ప‌డుతోంది. మ‌రి ఓటీటీలో ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి.