క‌రోనా‌పై సినిమా.. టైటిల్ & ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌..!!

-

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ మ‌హ‌మ్మారి థాటికి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. ఇప్ప‌టికే క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 ల‌క్ష‌లు దాట‌గా.. మ‌ర‌ణాళ సంఖ్య 1 ల‌క్షా 30 వేలు దాటింది. ఈ మ‌హ‌మ్మారికి మందు లేక‌పోవ‌డంతో.. ప్ర‌పంచ‌దేశాలు దీన్ని నియంత్రేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాలు ఎక్క‌డిక‌క్క‌డ లాక్‌డౌన్ విధించ‌డంతో పాటు క‌ఠ‌న చ‌ర్య‌లు సైతం తీసుకుంటాయి. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు.

కరోనాపై సినిమా .. ఫస్ట్ లుక్ రిలీజ్ ...

ఒక‌వేళ ఎవ‌రైనా ధైర్యం చేసి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌.. పోలీసులు త‌మ లాటీల‌కు ప‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ప్రాణాంత‌క‌ర క‌రోనా వైర‌స్‌పై ఓ సినిమా రాబోతుంది. మ‌రియు టైటిల్ & ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల అయింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. క‌రోనా కార‌ణంగా అమ‌ల‌వుతున్న ఈ లాక్‌డౌన్ ఇతివృత్తంగా సినిమా తీయాలని కోలీవుడ్ నిర్మాత ఎం. విజయ భాస్కర్ రాజ్ డిసైడ్ అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే ‘21 డేస్‌’ పేరుతో స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు వెల్ల‌డించారు.

 

మ‌రో విష‌యం ఏంటంటే.. దర్శకుడిగా ఆయనకిదే మొద‌టి చిత్రం. మ‌రియు ఈ సినిమాకు కథ, కథనం, మాటలు కూడా ఆయనే అందిస్తున్న‌ట్టు తెలుస్తోంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనున్న‌ట్టు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా విజ‌య్‌ మాట్లాడుతూ.. కేవ‌లం మూడు గంటల్లోనే కథ తట్టిందని, వారం రోజుల్లో స్క్రిప్ట్ తయారు చేశానని వెల్ల‌డించారు. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టాలన్న ఆలోచనతో ఉన్నానని చెప్పారు. ఇక ఈ క‌రోనా వైరస్‌పై ప్రజల్లో చైతన్యం కలిగించేలా 21 డేస్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు విజ‌య్ భాస్క‌ర్ స్ప‌ష్టం చేశారు. మ‌రి ఈ సినిమా ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news