కిం – నార్త్ కొరియా – కరోనా – ఇదొక డెడ్లీ కాంబినేషన్ !

-

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి నార్త్ కొరియా లో మాత్రం అడుగు పెట్ట లేకపోయింది. సుమారు 200 దేశాలకు విస్తరించి దాదాపు కొన్ని లక్షల మందికి సోకిన కరోనా వైరస్ తమ దేశంలో ఏ ఒక్కరికి కూడా సోకలేదని ఉత్తరకొరియా ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు వెల్లడించారు. కరోనా రహిత దేశంగా నిలిచామని చెప్పారు. చైనాలో కరోనా వెలుగు చూసిన వెంటనే ఈ ఏడాది జనవరిలోనే సరిహద్దులను మూసివేసి కఠిన ఆంక్షలు విధించినట్లు వివరించారు. దేశంలో ప్రవేశించే ప్రతి ఒక్కరిని పరిశీలించి క్వారంటైన్ కి తరలించడం, సరుకులను శుద్ధిచేయడం, సరిహద్దులు మరియు సముద్ర మార్గాలను మూసివేయడం వంటి చర్యలు విజయవంతమై ఇప్పటివరకు కూడా ఒక కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు.North Korea courts Russia after Trump-Kim summit failure ...మరోవైపు ఉత్తర కొరియా కరోనా పాజిటివ్ కేసులను దాచిపెడుతుంది అని విమర్శిస్తున్న నిపుణులు బలహీనమైన వ్యవస్థ కలిగిన నార్త్ కొరియాలో వైరస్ విస్తరించే ప్రమాదం అధికమని పేర్కొంటున్నారు. కానీ నార్త్ కొరియా అధ్యక్షుడు కిం వైరస్ వచ్చిన స్టార్టింగ్ లోనే ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆయన చేసిన హెచ్చరికల వల్లే ఆ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులో రావడం లేదని మరో పక్క వార్తలు వస్తున్నాయి. అధ్యక్షుడు కిం… కరోనా వైరస్ వచ్చి చాలా దేశాలలో మనుషులు చనిపోతున్నా సమయంలో…ఉత్తర కొరియా ప్రజలని ఉద్దేశించి ఎవరికైనా ఈ వైరస్ వస్తే వెంటనే కాల్చి చంపుతామని ప్రకటించడం జరిగింది. 

 

దీంతో ఈ ప్రకటనతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ముందుగానే ప్రభుత్వం ఇచ్చిన సూచనలను జాగ్రత్తలను పాటించారట. అందుకే కరోనా వైరస్ నార్త్ కొరియా లో ప్రభావం చూపించలేదు అన్న టాక్ బలంగా వినబడుతోంది. ప్రపంచంలో ప్రజలను ఇంటిలో నుండి బయటకు రాకుండా అరికట్టాలని ఆయా దేశాల ప్రధానులు నానా తిప్పలు పడుతుంటే నార్త్ కొరియా అధ్యక్షుడు కిం ఒకే ఒక్క ప్రకటనతో కరోనా వైరస్ ని భలే హ్యాండిల్ చేశాడు అని చాలామంది అంటున్నారు. ఏది ఏమైనా కిం ఇచ్చిన ప్రకటన చూస్తే కిం – నార్త్ కొరియా – కరోనా – ఇదొక డెడ్లీ కాంబినేషన్ అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news