కొన్ని సార్లు మంచితనం నుంచి క్రైమ్..‘కొండా’ ట్రైలర్ ఔట్

వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కొండా మురళీ ధర్ రావు జీవితంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘కొండా’. ఈ సినిమా రెండో ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. వరంగల్, వంచనగిరి పరసర ప్రాంతాల్లోనే ఈ చిత్ర మేజర్ పార్ట్ షూటింగ్ జరిగింది.

ట్రైలర్ లో ఆర్జీవీ మార్క్ కనబడుతోంది. 1990 ప్రాంతంల్లో నాటి పరిస్థితులను సినిమాలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు వర్మ. కొండా మురళి-సురేఖ మధ్య ఉన్న లవ్ స్టోరి, ఆనాటి రాజకీయ, సామాజిక పరిస్థితులను వెండితెరపైన ఆవిష్కరించనున్నారు. నక్సలైట్లతో కొండా మురళికి ఉన్న సంబంధం, రాజకీయ ఎత్తుగడలను సైతం సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.

ట్రైలర్ లో కొండా మురళిగా హీరో పర్ఫార్మెన్స్ బాగుంది. ఈ నెల 23న సినిమా విడుదల కానుంది. ఆర్జీవీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రేష్ట పటేల్ మూవీస్ బ్యానర్ పై యాపిల్ ట్రీ/ఆర్జీవీ వారు నిర్మించారు.