మొద‌టిసారి హీరోయిన్‌ను రిపీట్ చేస్తున్న కొర‌టాల శివ‌

తెలుగు ఇంస్ట్రీలోనే స‌క్సెస్ ఫుల్ అండ్ బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గా దూసుకుపోతున్నాడు కొర‌టాల శివ‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న తీసిన అన్ని సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచాయి. తీసిన‌వి నాలుగు సినిమాలే అయినా అన్నీ వంద కోట్ల పైన వ‌సూలు చేసిన‌వే కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఈయ‌న మ‌రోసారి ఎన్టీఆర్‌తో మూవీ చేస్తున్నారు. అయితే మొద‌టి సారి ఆయ‌న ఓసెంటిమెంట్‌ను పాలో అవుతున్నారు.

 

ప్ర‌స్తుతం చిరంజీవితో ఆచార్య మూవీ చేస్తున్న కొర‌టాల శివ‌.. క‌రోనా బ్రేక్ తీసుకున్నాడు. ఈ టైమ్‌లోనే కొరటాల ఎన్టీఆర్ మూవీ కోసం స్క్రీప్ట్ డెవ‌ల‌ప్ మెంట్ ప‌నులు ముంద‌టేసుకున్నాడు. అలాగే హీరోయిన్ ను వెతికే ప‌నిలో ప‌డ్డాడు ఈ డైరెక్ట‌ర్‌.

ఇక మొద‌టి నుంచి ఈ మూవీలో ఎన్టీఆర్ ప‌క్క‌న బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ చేస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇదే విష‌యం ఇప్పుడు నిజం అవుతోంద‌ని స‌మాచారం. ఈ సినిమాలో యంగ్ టైగ‌ర్‌కు జోడీగా కియారానే ఫైన‌ల్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే కొర‌టాల ఆమెకు క‌థ వినిపించి ఓకే చేయించాడంట‌. మొద‌టి సారి కొర‌టాల ఓ హీరోయిన్‌ను రిపీట్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే భ‌ర‌త్ అనే నేను మూవీలో కియారా న‌టించింది. ఇక ఎన్టీఆర్ మూవీ వ‌చ్చే సంవ‌త్స‌రం ఏప్రిల్ 22న థియేట‌ర్ల‌లోకి వ‌స్తుంది.