ఏపీలో మరో దారుణం… చాక్లెట్లు కొనిస్తానని 8 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన శిక్షలు అమలు చేసినా.. మహిళలపై దాడులు ఆగడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని తెచ్చినా.. రేప్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకు ఈ దారుణాలకు హద్దు, అదుపులేకుండా పోతోంది. అయితే.. తాజాగా ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా నందిగాం (మం) పెద్దతమరాపల్లి గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. చాక్లెట్లు కొనిస్తానని స్థానిక ప్రాథమిక పాఠశాల బాత్రూంలోకి ఆ వృద్ధుడు తీసుకెళ్లాడు.

ఆ తర్వాత ఆత్యాచారాని కి ఒడిగొట్టాడు. అయితే.. అత్యాచారం చేసేందుకు యత్నించడంతో బాలిక కేకలు వేసింది. దీంతో ఆ బాలిక కేకలు విన్న గ్రామస్తులు… స్కూల్ వద్ద కు చేరి ఆ మైనర్ బాలికను రక్షించారు. ఆ తర్వాత ఈ ఘటనపై నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలిక అమ్మమ్మ. దీంతో అత్యాచారయత్నం చేసిన వృద్ధుడు పి రాజారావుపై కేసు నమోదు చేసారు నందిగాం పోలీసులు.