చిరంజీవి సినిమాకు అండగా ఉన్నానన్న మహేష్…!

-

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఆచార్య సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఏ ప్రకటన వచ్చినా సరే ఆసక్తిగా వింటున్నారు. ఇక ఈ సినిమాలో ఒక పాత్రకు సంబంధించి పెద్ద చర్చలు జరుగుతున్నాయి. అదే రామ్ చరణ్, మహేష్ బాబు పాత్ర. ఈ ఇద్దరు ఈ సినిమాలో నటించే అవకాశం ఉందని అన్నారు.Koratala Shiva fires on hyderabad voters

ముందు రామ్ చరణ్ కోసం ఒక కీలక పాత్ర రెడీ చేసారని ప్రచారం జరిగింది. రామ్ చరణ్ షూటింగ్ కి కుదరకపోతే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇద్దరిలో ఒకరిని తీసుకుంటారు అని అన్నారు. దీనికి సంబంధించి దర్శకుడు కీలక విషయం చెప్పాడు. `ఆచార్య`లో ఓ కీలక పాత్ర కోసం రామ్‌చరణ్‌ను తీసుకోవాలనుకున్నామని… అయితే `ఆర్ఆర్ఆర్` షెడ్యూల్ వల్ల చెర్రీ అందుబాటులో ఉండేది అనుమానంగా మారిందని అన్నాడు.

నేను టెన్షన్ పడడాన్ని మహేష్ బాబు గమనించారని అన్నారు. `మరీ అవసరమైతే నేను ఉన్నాను` అని మహేష్ చెప్పారని కొరటాల వివరించారు. మహేష్ ఆ మాట అనడం నాకు చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నాడు. సినిమాలో పాత్ర గురించి కూడా తెలియకుండా `నేనున్నా` అని మహేష్ చెప్పారని… ఆయనది గొప్ప మనసు` అని కొరటాల వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news