NTR 30 : కథ మారింది..కొత్త కథతో వస్తున్న కొరటాల-ఎన్టీఆర్ !

-

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం తన 30 వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయినప్పటికీ హీరోయిన్ల ఎంపిక విషయంలో కొంచెం తడబాటు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా మొన్నటి వరకు కొంతమంది హీరోయిన్ లని అనుకున్నారు. ఆ తర్వాత శ్రీదేవి కోరిక మేరకు ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తోందని ప్రచారం కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా గురించి సోషల్‌ మీడియాలో ఓ కొత్త చర్చ జరుగుతోంది.

మొదట ఎన్టీఆర్‌ కు చెప్పిన కథను పూర్తిగా మార్చేసేందుకు కొరటాల శివ నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు ఇప్పటికే ఈ విషయాన్ని ఎన్టీఆర్‌ తో చర్చించగా.. దానికి ఆయన కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. దీంతో ఎన్టీఆర్‌ 30 కొత్త కథతో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news