మీ జీమెయిల్​లో ఎవరైనా లాగిన్ అయ్యారా.. తెలుసుకోండిలా..?

-

సెల్​ఫోన్ ఉన్న ప్రతివారు ఎక్కువగా ఉపయోగించేది గూగుల్, గూగుల్ మెయిల్, యూట్యూబ్, చాట్ యాప్స్. అయితే మీరు దాదాపుగా అన్నింట్లో జీమెయిల్​తో లాగిన్ అవుతారు. జీమెయిల్​లో లాగిన్ అయినప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండకపోతే అనర్థాలు జరుగుతాయి. మీ జీమెయిల్ ద్వారా మీ ఫేస్​బుక్ ఖాతాలో ఎవరైనా లాగిన్ అయితే మీ పని అంతే ఇక. అందుకే మీ జీమెయిల్​లో ఎవరైనా లాగిన్ అయ్యారేమో తెలుసుకోండి. అదెలాగంటే..?

మీ గూగుల్​ ఖాతాలోకి వెళ్లండి. ఎడమ వైపున ఉన్న నావిగేషన్​ ప్యానెల్​ నుంచి “సెక్యూరిటీ” ఆప్షన్​ పై క్లిక్​ చేయండి. తర్వాత “యువర్ డివైజైస్​” ప్యానెల్​ నుంచి “మేనేజ్​ ఆల్​ డివైజెస్​” ఆప్షన్ ఎంచుకోండి.

ప్రస్తుతం మీరు ఏ డివైజ్​ నుంచి జీమెయిల్​ ఖాతాలోకి లాగిన్​ అయ్యారో ఇక్కడ కనిపిస్తుంది. గత కొంత కాలం నుంచి లాగిన్ అయిన వివరాలు కూడా కనిపిస్తాయి. ఇంకా వివరాలు కావాలనుకుంటే ఆ డివైజ్​ మీద క్లిక్​ చేయాలి. లాగిన్​ వివరాలతో పాటు ఎప్పుడెప్పుడు ఖాతాలోంచి లాగౌట్ అయ్యామో కూడా తెలుసుకోవచ్చు. మన ఖాతా గురించి పూర్తి వివరాలు తెసుకునేందుకు గూగుల్​ మనకు సహకరిస్తుంది. ఒకవేళ లాగిన్​ అయింది మీరు కాకుంటే ఇక్కడ నుంచి సైన్​ ఔట్​ కావచ్చు.

కొన్నిసార్లు మనం అనుకోకుండా మెయిల్​ సెండ్​ చేస్తాం. ఆ పొరపాటును సరిదిద్దుకునేందుకు జీమెయిల్​లో అండూ ఆప్షన్​ ఉంటుంది. అయితే ఇందుకోసం మనం డిలే సమయాన్ని సెట్​ చేయాల్సి ఉంటుంది. ఆ నిర్దిష్ట సమయంలోగా మనం అండూ క్లిక్ చేస్తే ఆ మెయిల్​ను అవతలి వారు చూడలేరు.

జీమెయిల్​ వెబ్​సైట్​ ఓపెన్ చేసి, ఎడమవైపున ఉన్న ‘గేర్’​ ఐకాన్​ పై క్లిక్​ చేయండి.⦁ అందులో ‘సెట్టింగ్స్​’ను సెలెక్ట్ చేసుకోండి.⦁ తర్వాత జనరల్​ ట్యాబ్​లో ‘అండూ సెండ్’ ఆప్షన్ సెలెక్ట్​ చేసుకోండి.⦁ అనంతరం అక్కడ డ్రాప్​ డౌన్​ మెనూలో 5 సెకన్లు, 10 సెకన్లు, 20 సెకన్లు, 30 సెకన్లు అని కనిపిస్తుంది. అక్కడ టైమ్​ సెట్​ చేసుకోండి. తర్వాత ‘సేవ్​ ఛేంజెస్’​ అనే బటన్​పై క్లిక్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news