ఇండియన్-2లో కొరియన్ స్టార్

-

శంకర్, కమల్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ (భారతీయుడు) సినిమా గుర్తుంది కదా. రెండు దశాబ్ధాల క్రితం సంచలన విజయం అందుకున్న ఈ సినిమాకు ఇన్నాళ్లకు సీక్వల్ గా మరో మూవీ వస్తుంది. శంకర్, కమల్ కాంబోలోనే ఈ సీక్వల్ రావడం విశేషం. ఇండియన్-2 కి సంబందించి ఓ పక్క షూటింగ్ మొదలు పెట్టారట కూడా. 2.ఓతో అంచనాలను అందుకోని శంకర్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

కమల్ హాసన్ చివరి చిత్రంగా ప్రచారంలో ఉన్న ఇండియన్-2 మూవీలో కాజల్ అగర్వాల్ ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అవగా మరో హీరోయిన్ గా కొరియన్ బ్యూటీ బేయ్ సుజీ కూడా ఈ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందట. ఇండియన్ 2 సినిమాకు ప్రత్యేకంగా హాలీవుడ్ మేకప్ మెన్ పనిచేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ మూవీ 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి ఈ ఇయర్ దసరాకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news