పవన్ చిరస్థాయిగా నిలిచే విజయం కనపడుతుంది: క్రిష్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్… జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ లోనే ఒక భిన్నమైన కథతో ముందుకు వస్తున్నారు. నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా క్రిష్ ట్విట్టర్ వేదికగా దీనికి సంబంధించిన ఒక లుక్ ని విడుదల చేసారు. అలాగే ఒక కామెంట్ కూడా ఆయన చేసారు. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ 27 పదిహేన్రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది.

చిర స్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుందని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయమని, ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ ఆయన ట్వీట్ చేసారు. ఈ సినిమా కొంత భాగం షూట్ చేసుకోగా కరోనా లాక్ డౌన్ తో మిగిలిన షూట్ వాయిదా వేసారు.

Read more RELATED
Recommended to you

Latest news