శ్రావణ భార్గవిపైన కామెంట్స్ సరికాదు..ఆమెపై వేసిన కేసు నిలబడదు: కృష్ణ కుమారి

-

టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ సాంగ్..‘సింహమంటి చిన్నోడే’తో చక్కటి గుర్తింపు పొందిన సింగర్ శ్రావణ భార్గవి. టాలీవుడ్ లో సింగర్ గా దూసుకుపోతున్న ఈమె..సింగర్ హేమచంద్రను మ్యారేజ్ చేసుకుంది. తాజాగా శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకుంది. ఆమె అన్నమాచార్య కీర్తనను అభ్యంతరకరంగా పాడిందని అన్నమయ్య వంశస్థులు, టీటీడీలోని కొందరు ట్రోల్ చేస్తున్నారు.

తాను పాడిన పాటలో అశ్లీలత లేదని శ్రావణ భార్గవి చెప్తున్నప్పటికీ వారు వినడం లేదు. శ్రావణ భార్గవిని టార్గెట్ చేసి నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయమై సామాజిక వేత్త కృష్ణ కుమారి స్పందించారు. దేవుడి సినిమాలు ‘అన్నమయ్య’ తదితరాల్లో బూతు పాటలు ఉండగా అవి వారికి కనిపించడం లేదా? అని ఆమె ప్రశ్నించారు.

శ్రావణ భార్గవి పాడిన తీరు నచ్చకపోతే చూడొద్దని, అంతే కాని ఆమెపైన వ్యక్తిగత దూషణలు సరి కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమెపై వేసిన కేసు నిలబడదని, అన్నమాచార్య కీర్తనలకు కాపీ రైట్ ఎవరికీ లేదని తెలిపారు. శ్రావణ భార్గవి వ్యక్తిగత జీవితం, ముఖం ఇతరాల గురించి కామెంట్స్ చేయడం సరి కాదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version