కృష్ణ – ఎన్టీఆర్ ల మధ్య గొడవలు రావడానికి కారణం..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ సాహసాలకు మారుపేరు . తెలుగు సినిమా రూపురేఖలను మార్చిన ఘనత ఈయనిదే.. నటశేఖరుడు గా గుర్తింపు పొందిన ఈయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు తన 79వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ తన కెరియర్ లో వందలాది సినిమాలను తెరకెక్కించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఇక నటసార్వభౌముడు ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీకి మూలస్తంభంగా ఉన్న ఈయన ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా జానపద, పౌరాణిక చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇదిలా ఉండగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా విషయంలో అప్పట్లో ఎన్టీఆర్ కి , కృష్ణ కి మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం బాగా జోరుగా సాగింది. ఇక తన కెరీర్ లోనే గొప్ప చిత్రం అల్లూరి సీతారామరాజు కృష్ణ ఎన్నోసార్లు తెలిపారు. ఇక కృష్ణ ఒక సందర్భంలో ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. నటుడు కాకముందు నుంచి అల్లూరి గురించి బుర్ర కథల రూపంలో అనేక విషయాలు వింటూ వచ్చాను. ఒకరోజు ఎన్టీఆర్ తదుపరి చిత్రం అల్లూరి సీతారామరాజు అని చదివాను. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ ఎప్పుడు ఈ చిత్రం తీస్తారని ఎదురుచూసాను .కానీ ఎంతకీ ఆ చిత్రం ప్రారంభం కాలేదు..

అందుకే నేనే నా 100వ చిత్రంగా అల్లూరి సీతారామరాజు సినిమాను ఎంచుకొని నేనే నిర్మించాను. ఇక ఆ చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే .నేను 365 సినిమాల్లో నటించినప్పటికీ నా ఉత్తమ చిత్రం ఎప్పటికీ అల్లూరి సీతారామరాజు కృష్ణ స్పష్టం చేశారు. తాను చేయాలనుకున్న అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణ చేయడంతో ఎన్టీఆర్ మనస్థాపానికి గురి అయ్యారు అని అప్పటి నుంచి వారి ఇద్దరి మధ్య దూరం పెరిగిందని ఇక ఆ తరువాత ఎన్నో చిత్రాల విషయాలలో.. రాజకీయాల్లో కూడా ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఎన్ని గొడవలు ఉన్నా సరే కృష్ణ మాత్రం ఎన్టీఆర్ ను పొగుడుతూనే ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version