లిప్ లాక్ త‌న‌కు సెంటిమెంట్ అంటున్న కృతి శెట్టి

ఉప్పెన సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిన కృతి శెట్టి ప్ర‌స్తుతం నేచుర‌ల్ స్టార్ నాని తో శ్యామ్ సింగ‌రాయ్ సినిమా లో న‌టిస్తుంది. అయితే ఇటీవ‌ల శ్యామ్ సింగ‌రాయ్ సినిమా టీజ‌ర్ విడుద‌ల అయిన విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమా లో హీరో నానికి హీరోయిన్ కృతి శెట్టి మ‌ధ్య రొమాంటిక్ సీన్స్ ఎక్కువ గానే ఉన్నాయ‌ని తెలుస్తుంది. టీజ‌ర్ లో కూడా దాదాపు రెండు లిప్ లాక్ సీన్లను చూపించారు. అయితే కృతి శెట్టి లిప్ లాక్ స‌న్నివేశాల‌లో న‌టించ‌డం పై మిశ్రమ స్పంద‌న వ‌చ్చింది. అయితే దీని పై తాజా గా హీరోయిన్ కృతి శెట్టి స్పందించింది.

త‌న‌కు సినిమాల‌లో లిప్ లాక్ సీన్స్ ఉండ‌టం సెంటిమెంట్ అని ప్ర‌క‌టించింది. తాను న‌టించే సినిమాల‌లో లిప్ లాక్ సీన్లు ఉంటే ఆ సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌ని తెలిపింది. అందుకే శ్యామ్ సింగ‌రాయ్ సినిమా లో లిప్ లాక్ సీన్లు ఒప్పుకున్నానని ప్ర‌క‌టించింది. కాగ కృతి శెట్టి మొద‌టి సినిమా అయిన ఉప్పెనలో హీరో వైష్ణ‌వ్ తేజ్ తో ఒక రొమాంటిక్ సీన్లో లిప్ లాక్ ఉంటుంది. అయితే ఉప్పెన సినిమా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్ కొట్టింది. అయితే శ్యామ్ సింగరాయ్ లోనూ లిప్ లాక్ ఉంది. అయితే ఈ సినిమా హిట్ అయితే కృతి శెట్టి లిప్ లాక్ సెంటిమెంట్ వ‌ర్క్ అవుట్ అయిన‌ట్టే.