పవన్‌కల్యాణ్ నటించిన ‘తీన్‌మార్’తో కృతి కర్బందా తెలుగువారికి చేరువైంది. ఆ సినిమాలో తన అందం, అభినయం, అమాయకత్వంలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘మిస్టర్ నూకయ్య’, ‘ఒంగోలు గిత్త’ వంటి సినిమాల్లోనూ సందడి చేసింది. ఇక ఆ తర్వాత ఈ భామ ముంబయికి పయనమై.. బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కృతి గతంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.
‘‘నేను నటించిన ఓ కన్నడ సినిమా షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న ఈ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. హోటల్‌లో పనిచేసే ఒక వ్యక్తి నా రూమ్‌లో సీక్రెట్‌గా కెమెరా పెట్టాడు. బస చేసే రూమ్‌ను తరచూ చెక్ చేసుకోవడం నాకూ, నా బృందానికీ అలవాటు. అలా, నా రూమ్‌లో కెమెరాని గుర్తించాం. సెట్ అప్ బాక్స్ వెనుక అతడు ఉంచిన కెమెరాని చూసి షాకయ్యా. బయట ఎక్కడైనా బస చేయాల్సి వస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా’’ అని ఆమె చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.