నయనతార గ్లామర్ సీక్రెట్ ఇదే.. అయితే భర్తతో మాత్రం..!

-

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. రెండు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ భారీ పారితోషకంతో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. ఇప్పటికి నయనతార కాల్ షీట్ కావాలి అంటే రూ .5కోట్లకు పై మాటే అన్నట్టుగా దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. స్టార్ హీరోలను మించి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నయనతార లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు పారితోషకం అందుకుంటుంది.

గత సంవత్సరం కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న నయనతార .. సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది. దాదాపు ఏడు సంవత్సరాలు ఘాఢంగా ప్రేమించుకున్న ఈ జంట గత ఏడాది పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇకపోతే 40 సంవత్సరాల వయసుకి దగ్గరవుతున్నా కూడా నయనతార అందం మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదని చెప్పాలి. ఇంత గ్లామర్ మెయింటైన్ చేయడానికి కారణం కూడా లేకపోలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

నయనతార ప్రతిరోజు తన భర్తతో కలిసి కనీసం రెండు గంటల పాటు యోగ తప్పకుండా చేస్తుందట. అలాగే డైట్ తో పాటు హెల్తీ ఫుడ్ కూడా తీసుకుంటుందని.. ఇక తాను ఫాలో అయ్యే డైట్ లో ప్రతిరోజు కొబ్బరినీళ్లు, జ్యూస్ తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటుందని సమాచారం. ఇక భోజనం సమయంలో నాన్ వెజ్, వెజిటేబుల్స్, గుడ్లను సమపాళ్లల్లో తింటుందట. ఆయిల్ ఫుడ్ కి కంప్లీట్ గా దూరం ఉండే ఈమె వీటితోపాటు కచ్చితంగా రోజుకు 8 గంటలకు పైగా నిద్రపోతుందని.. వీటి వల్లే ఈ వయసులో కూడా ఇంత గ్లామర్ గా ఉండడానికి కారణం అని నయనతార సన్నిహితులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news