వెండితెర‌పైకి సిల్క్‌స్మిత జీవితం!

-

సిల్క్‌స్మిత‌.. యువ‌త‌కు మాత్ర‌మే కాదు కొంత మంది హీరోల‌కు కూడా క‌ల‌క‌ల రాణిగా నిలిచింది. మ‌త్తెక్కించే చూపుల్తో కైపెక్కించింది. మాయ చేస్తూ మైమ‌ర‌పించే ఆమె ముగ్ధ‌మ‌నోహ‌ర‌మైన రూపానికి తెలుగు ద‌క్షిణాదిలో దాసోహం కాని యువ‌కుడు లేడంటే అది అతిశ‌యోక్తి కాదేమో. వెండితెర‌పై బావ‌లు స‌య్యా అంటూ గిలిగింత‌లు పెట్టిన సిల్క్ స్మిత ఏజ్‌తో నిమిత్తం లేకుండా అన్ని వ‌య‌సుల వారికి ఓ హాట్ ఫేవ‌రేట్‌గా నిలిచి క‌ల్లోలం సృష్టించింది.

ఇండ‌స్ట్రీలో క్రేజీ న‌టిగా ఓ వెలుగు వెలుగుతున్న స‌మ‌యంలోనే అనుమానాస్ప‌దంగా మృతి చెందింది. ఇప్ప‌టికీ ఆమె మృతి మిస్ట‌రీగానే మిగిలిపోయింది. స్మిత జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో `డ‌ర్టీపిక్చ‌ర్‌`ని రూపొందించారు. ఇందులో సిల్క్ పాత్ర‌లో విద్యాబాల‌న్ న‌టించింది. జాతీయ స్థాయిలో త‌న న‌ట‌న‌కు గానూ ఉత్త‌మ న‌టిగా పుర‌స్కారాన్ని కూడా ద‌క్కించుకుంది. ఇప్పుడు మ‌ళ్లీ సిల్క్ జీవిత క‌థ ఆధారంగా త‌మిళంలో మ‌రో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

`అవ‌ల్ అప్ప‌డిదాన్‌` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. ల‌క్ష్మ‌ణ్‌. హెచ్ ముర‌ళి నిర్మించ‌నున్న ఈ చిత్రానికి కె.ఎస్‌. మ‌ణికంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. న‌వంబ‌ర్‌లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. సిల్క్ స్మిత పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌న్న‌ది ఇంకా ఫైన‌ల్ కాలేదు. అచ్చం సిల్క్‌ని పోలీవుండే న‌టి కోసం మేక‌ర్స్ వెతుకుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version