రొమాంటిక్, థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో “అసలేం జరిగింది” ..!

-

తెలుగులో చాలా కాలం తర్వాత మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు శ్రీరాం. ఒకరికి ఒకరు సినిమాతో హీరోగా పరిచయమయిన శ్రీరాం… ఆ తర్వాత ఆడవారి మాటలకి అర్థాలే వేరులే, దడ వంటి సినిమాలలో నటించాడు. అయితే శ్రీరాం తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోగా నటించాడు. ఇలా రెండు భాషల్లో మంచి పాపులారిటీని సాధించిన ఈ హీరో మరోసారి తన సత్తా చాటాలని చేస్తున్న వినూత్న ప్రయత్నమే అసలేం జరిగింది.

 

చిన్న సినిమా అయినా అద్భుతమైన కాన్సెప్ట్ తో అసలేం జరిగింది సినిమాని రూపొందించారు. శ్రీరాం సరసన సంచిత పదుకొణె హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకి నూలేటి వీర రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు ..ఎక్సోడస్ మీడియా సంస్థ బ్యానర్ లో కె నీలిమ నిర్మిస్తున్నారు. సినిమా మీద ఉన్న ప్రేమ తో ప్రేక్షకులు ఒక మంచి సినిమాని అందించాలన్న తాపత్రయంతో చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావాలని పలువు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ జోనర్ లో అసలేం జరిగింది సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పాటలకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్ వచ్చింది. ఇక ఈ సినిమాకి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version