`RRR` టైటిల్ ఫిక్స్ అయిన‌ట్టేనా..

-

`బాహుబ‌లి` త‌ర్వాత ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న‌ మ‌రో భారీ చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఎంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ ఈ సినిమాలో హీరోలుగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక‌ భారీ బ‌డ్జెట్‌, అంచ‌నాల‌తో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జూలై 30న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. సినిమా టైటిల్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం న‌లుగుతున్న `RRR` అనేది వ‌ర్కింగ్ టైటిల్ మాత్రమే.

దీనికి స‌రిపోయేలా మంచి టైటిల్‌ను కూడా సూచించాల‌ని చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో ప్రేక్ష‌కుల‌ను కోరింది. చాలా మంది `RRR`కు స‌రిపోయేలా చాలా ర‌కాల టైటిల్స్‌ను చెప్పారు. లేటెస్ట్‌గా ఈ సినిమాకు `రామ‌రౌద్ర రుషితం` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ద‌క్షిణాదిన `రామ‌రౌద్ర రుషితం` అనే టైటిల్‌ను.. ఇత‌ర భాష‌ల్లో `రైజ్ రివోల్ట్ రివేంజ్‌` అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌ని టాక్‌. అయితే త్వ‌ర‌లోనే టైటిల్‌పై ఓ క్లారిటీ రానుంద‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version