హీరో రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో రోజుకో మలుపు చోటుచేసుకుంటుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన లావణ్య ఈ వివాదంలోకి నటి, యాంకర్ అరియానా గ్లోరీని లాగింది. 2021లో రాజ్ తరుణ్, అరియానాలు తనకు ఫోన్ చేసి బెదిరించారని లావణ్య ఆరోపించింది. రాజ్‌ను వదిలేయాలంటే ఎంత డబ్బులు కావాలో చెప్పు అని అడిగిందని తెలిపింది. తాను, రాజ్ లైఫ్ లాంగ్ కలిసి ఉంటామని.. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా చెప్పామని అరియానా తనతో చెప్పిందని లావణ్య వెల్లడించింది.
మరోవైపు హైదరాబాద్ కోకాపేట ఇంటి వద్ద జరిగిన గొడవపై ఫిర్యాదు చేసేందుకు లావణ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. 15 మందితో కలిసి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తనపై దాడి చేశారని లావణ్య ఆరోపించింది. ఆ ఇల్లు రాజ్ తారుణ్ తాతముత్తాతలది కాదని తెలిపింది. ఈ మేరకు రాజ్ తరుణ్ తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది లావణ్య. బుధవారం రోజున లావణ్య ఇంటికి వెళ్లిన రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆ ఇల్లు తమ కుమారుడిదని లావణ్యను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. కానీ లావణ్య ఇది తన ఇల్లేనని వాళ్లను బయటకు గెంటేసింది.