టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్‌కు గురైంది. అందులో ట్రేడింగ్‌కు సంబంధించిన పోస్టులు కనిపించాయి. తాను ట్రేడింగ్ చేశానని.. భారీగా డబ్బులు వచ్చినట్లు అందులో పేర్కొన్నట్లుగా ఉంది. ‘ఈ యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు. నేను కూడా ఇది వాడుతున్నాను’ అంటూ హ్యాకర్లు మంచు లక్ష్మి ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్టు పెట్టారు. దీన్ని గుర్తించిన మంచు లక్ష్మి తన ఇన్ స్టాగ్రామ్ హ్యాకింగుకు గురైందని తెలిపారు.
ఇలాంటివి నమ్మొద్దంటూ నెటిజన్లను ఆమె అలర్ట్ చేశారు. ఈ మేరకు తన ఇన్‌స్టా ఖాతా హ్యాక్ అయిందని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. తనకు డబ్బులు కావాలంటే ఇలా సోషల్ మీడియాలో కాకుండా నేరుగా అడుగుతానని మంచు లక్ష్మి తెలిపారు. ఇలాంటి వాటికి రిప్లైలు ఇవ్వొద్దని తన ఫాలోవర్లకు సూచించారు. ఇన్‌స్టాగ్రామ్ రీస్టోర్ అయిన తర్వాత మరోసారి ట్వీట్ చేస్తాను అని రాసుకొచ్చారు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్స్ ఈ విషయంలో తనకు సాయం చేయాలని మంచు లక్ష్మి కోరారు.