హాట్ మిర్చీలా సెగలు పుట్టిస్తున్న లావణ్య త్రిపాఠి..!

-

ప్రముఖ హాట్ గ్లామర్ బ్యూటీ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టింది. ఈ చిత్రంలో తన పెర్ఫార్మన్స్ తో అల్లరి పిల్లగా, డైలాగులు చెప్పే విధానం ఆమె ఎక్స్ప్రెషన్స్ అందరిని కూడా పూర్తిస్థాయిలో ఆకర్షించాయని చెప్పాలి. ఇకపోతే అందాల రాక్షసి సినిమా ఈమెకు బాగా కలిసొచ్చింది అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత గ్లామర్ రోల్స్ ఎక్కువగా ఉండే పాత్రలే ఈమె పోషించింది.

మొన్నటి వరకు మంచి సక్సెస్ కూడా అందుకున్న లావణ్యకి ఇప్పుడు సరైన సక్సెస్ అందడం లేదు. దీంతో వెండితెరపై ప్రయత్నాలు చేస్తూనే ఓటీటీ లో కూడా వెబ్ సిరీస్ ల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇటీవల పులి మేక అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె దీంతో భారీ విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పాలి. ఇదిలా ఉండగా లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామర్ షో కి పదును పెడుతుందని చెప్పవచ్చు..

ఇక తాజాగా కళ్ళు చెదిరే రెడ్ కలర్ శారీలో తన అందాలను పలకబోస్తూ మరొకసారి మెస్మరైజ్ చేసింది. చురకత్తులు లాంటి చూపులతో లావణ్య త్రిపాఠి ఫోటోలకు ఇస్తున్న ఫోజులు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి.. స్లీవ్ లెస్ బ్లౌజ్, రెడ్ కలర్ సారీ తో నడుము వంపులతో హాట్ మిర్చిలా సెగలు పుట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే లావణ్య షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇవి చూసిన నెటిజనులు కూడా తమకి నచ్చిన విధంగా కామెంట్లు చేస్తూ ఆమెను భారీగా పాపులారిటీ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version